కొంతకాలం క్రితం ప్రియాంక చోప్రా మాట్లాడిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరలైంది. తను ఏం మాట్లాడింది? అనే విషయానికొస్తే.. ‘అబ్బాయిలు తాము పెళ్లాడబోయే అమ్మాయిల్లో చూడాల్సింది వర్జినిటీని కాదు. వ్యక్తిత్వంలో ఒరిజినాలిటీని. వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పోతుంది. కానీ సభ్యత, సంస్కారం జీవితాంతం ఉంటాయి’ అని ప్రియాంక ఎక్కడో మాట్లాడిందంటూ ఓ వార్త పోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. దీనిపై రీసెంట్గా ప్రియాంక స్పందించింది.
‘అసలు ఆ మాటలు నావి కావు. ఆ విధంగా నేను ఎక్కడా మాట్లడలేదు. అంతా అభూతకల్పన. ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు అసత్య వార్తలను సృష్టించడం, తద్వారా ఫేమస్ కావాలనుకోవడం ఇప్పుడు పరిపాటైపోయింది. ఇలాంటి వార్తలను చదివేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం రీడర్లకు ఎంతైనా ఉంది. ఆన్లైన్లో వచ్చే ప్రతి వార్తను నమ్మొద్దు’అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న ‘SSMB 29’ మూవీలో ఆమె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.