Lokah Chapter 1: Chandra | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్ 1 – చంద్ర'(Lokah Chapter 1: Chandra) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన వారం రోజులకే రూ.101 కోట్ల వసూళ్లను రాబట్టింది. మలయాళం జానపదం నుంచి తీసుకున్న కథ ఆధారంగా దానికి సూపర్ వుమెన్ కథను జోడించి ఈ సినిమాను దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించగా.. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించింది. ప్రేమలు నటుడు నస్లెన్ కె. గఫూర్ కథానాయకుడిగా నటించాడు. అయితే తాజాగా ఈ సినిమా చూసిన బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, ఆలియా భట్.. సినిమాపై ప్రశంసలు కురిపించారు.
భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో సినిమా మన ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు నిర్మాత దుల్కర్ సల్మాన్‌తో పాటు చిత్రయూనిట్‌కి అభినందనలు. ఈ సినిమా మలయాళంలో అందరి హృదయాలను గెలుచుకురి ఇప్పుడు హిందీలో అందుబాటులోకి వచ్చింది. నేను ఇప్పటికే ఈ సినిమాను నా వాచ్‌లిస్ట్‌లో పెట్టుకున్నాను. మీరు చూశారా అంటూ ప్రియాంక రాసుకోచ్చింది.
ఆలియా భట్ ఈ మూవీపై స్పందిస్తూ.. పౌరాణిక జానపదం, మిస్టరీ యొక్క అద్భుతమైన సమ్మేళనం ఈ లోక. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి విభిన్నమైన సినిమాకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సినిమా రంగానికి ఇది ఒక మంచి అడుగు అని నేను భావిస్తున్నాను. అంటూ ఆలియా భట్ రాసుకోచ్చింది.