Priyanka Mohan | ‘నాని గ్యాంగ్‌లీడర్’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది తమిళ సోయగం ప్రియాంక అరుళ్ మోహన్. ఆ తర్వాత శర్వానంద్‌తో ‘శ్రీకారం’ చిత్రంలో జోడీ కట్టింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. అక్కడ డాక్టర్, డాన్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. అదే ఉత్సాహంతో ప్రస్తుతం తెలుగులో భారీ అవకాశాలను దక్కించుకుంటున్నది. పవన్‌కల్యాణ్ ‘ఓజీ’, నాని ‘సరిపోదా శనివారం’లో ప్రియాంకానే కథానాయిక.
ఈ రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉండగానే తెలుగులో ఈ భామకు భారీ చిత్రాల ఆఫర్లొస్తున్నాయట. అగ్ర నిర్మాణ సంస్థలు ఈ సొగసరినే నాయికగా తీసుకోవాలనుకుంటున్నాయట. కెరీర్ ఆరంభంలో తెలుగు ఇండస్ట్రీ కాస్త నిరుత్సాహపరచినా..ఇప్పటి పరిస్థితి చూస్తుంటే రాబోవు రోజులన్నీ తనవే అనే ఆనందంలో ఉందట ప్రియాంక అరుళ్ మోహన్. ఇక నుంచి తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీకి సమప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటానని చెబుతున్నది ప్రియాంక అరుళ్ మోహన్.