అందం.. అభినయం.. అమాయకత్వం.. వెరసి ప్రియాంక అరుళ్ మోహన్. తొలి సినిమా ‘గ్యాంగ్‌లీడర్’ పెద్దగా ఆడకపోయినా అవకాశాలు మాత్రం ఆగలేదు ఈ అందాలబొమ్మకు. ఇప్పటికే తమిళంలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా జెండా పాతేసిన ప్రియాంక, తెలుగులో కూడా కైరీ అవకాశాలను సొంతం చేసుకుంటున్నది. ప్రస్తుతం తెలుగులో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’లో కథానాయికగా నటిస్తూ బిజీబిజీగా ఉన్న ప్రియాంకను మరో క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్టు విశ్వసనీయ సమాచారం.
రవితేజ కథానాయకుడిగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న చిత్రంలో ప్రియాంక ఎంపికైనట్టు తెలుస్తున్నది. కథ రీత్యా ఇందులో ఇద్దరు నాయికలు కాగా ఓ నాయికగా ప్రియాంకను తీసుకున్నారట మేకర్స్. ఇందులో ప్రియాంక పాత్ర ఫన్నీగా, బబ్లీగా ఉంటుందని తెలుస్తున్నది. అయితే.. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటనైతే రాలేదు. రవితేజ, గోపీచంద్‌ల బ్లాక్బాస్టర్ హిట్ ‘క్రాక్’ని మించే స్థాయిలో ఈ సినిమా కథ ఉందని సినీవర్గాల సమాచారం.