Cinema News | అందంగా ఉండేవాళ్లకు అభినయకౌశలం ఉండాలని లేదు. కానీ.. ప్రియాంకకు రెండూ మెండుగా ఉన్నాయి. అందుకే సదరన్ సినిమాలో దూసుకుపోతున్నది ప్రియాంక. తమిళంలో అయితే చేతినిండా సినిమాలే. తెలుగులో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’లో ప్రియాంకే కథానాయిక. ప్రస్తుతం తాను తమిళంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ సినిమాలో తొలిసారి డీ గ్లామరైజ్డ్ కేరక్టర్ చేస్తున్నది ప్రియాంక.
ఈ పాత్ర గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఇది పెక్యులర్ సబ్జెక్ట్. ఈ కథలో ఉన్న ప్రతి పాత్రా వైవిద్యమైనదే. అన్ని పాత్రలూ ఛాలెంజింగ్ రోల్సే. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఎంతో రీసెర్చ్ చేసి తయారు చేసుకున్న కథ ఇది. మూడేళ్ల క్రితమే ఈ కథ రెడీ చేశారాయన. ఓ విధంగా ఆ కథే పాత్రధారులను ఎంపిక చేసుకుంది అనాలి. అందరూ సరిగ్గా సెట్ అయిపోయారు. ముఖ్యంగా ధనుష్సార్. ఇందులో ఆయన నట విశ్వరూపాన్ని చూస్తారు. ఆయనతో పోటీపడి నటించే పాత్ర నాది. నా కెరీర్లో నిలిచిపోయే పాత్ర అని చెప్పొచ్చు.’ అని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది ప్రియాంక అరుళ్మోహన్.