ప్రియదర్శి నటిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’. ‘Thrill – U – Prapthirasthu’ అనేది ఉపశీర్షిక. ఆనంది కథానాయిక. సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. పుస్కూర్ రామ్మోహన్రావు, జాన్వీ నారంగ్ నిర్మాతలు. రానా దగ్గుబాటి సమర్పకుడు. ఈ నెల 21న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. పళ్లైన కొత్తజంట జీవితంలోని సరదాలు, ప్రేమ, గిల్లికజ్జాల మేళవింపుగా టీజర్ సాగింది.
సుమ కనకాల ఇందులో పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా నటించారు. ఆమె ఎంట్రీతో కథ మలుపు తీసుకున్నట్టు టీజర్ చెబుతున్నది. సిట్యూవేషన్ హ్యూమర్తోపాటు మనసులకు హత్తుకునే ఎమోషన్స్‌ని ఈ టీజర్లో అద్భుతంగా ఆవిష్కరించారు. టీజర్‌ను మించి సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: కార్తీక్ తుపురాణి, రాజ్‌కుమార్, కెమెరా: విశ్వనాథరెడ్డి, సంగీతం: లియోన్ జేమ్స్, సహనిర్మాత: ఆదిత్య మేరుగు, నిర్మాణం: ఎస్వీసీఎల్ఎల్పీ, స్పిరిట్ మీడియా.