ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. ‘థ్రిల్-యు ప్రాప్తిరస్తు’ ఉపశీర్షిక. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మిస్తున్నారు. సుమ కనకాల కీలక పాత్రధారి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ‘దోచావే నన్నే’ అనే పాటను హీరో నాని విడుదల చేశారు.
లియోన్‌జేమ్స్ స్వరపరచిన ఈ పాటను శ్రీమణి రచించారు. మెలోడీ ప్రధానంగా సాగిన ఈ పాట ప్రేమలోని హృద్యమైన భావాలను ఆవిష్కరిస్తూ సాగింది. ప్రియదర్శి, ఆనంది జోడీ ఆకట్టుకునేలా ఉంది. సంగీతభరిత ప్రేమకథా చిత్రమిదని, ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా అలరిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, రచన-దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్.