ప్రియదర్శి, ఆనంది జంటగా రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ ‘ప్రేమంటే’. ‘థ్రిల్ యు ప్రాప్తిరస్తు’ అనేది ఉపశీర్షిక. సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్మోహన్రావు, జాన్వి నారంగ్ నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ని అగ్ర హీరో నాగచైతన్య లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. లీడ్ పెయిర్ రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రెజెంట్ చేస్తూ ఈ పోస్టర్ని రూపొందించినట్టు తెలుస్తున్నది.
ఇప్పటికే 65శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యువతరం హార్ట్‌బీట్‌ను పెంచేలా ఉంటుందని, ఇందులోని ప్రేమభావం కొత్త అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: కార్తీక్ తుపరాణి, రాజ్‌కుమార్, కెమెరా: విశ్వనాథ్‌రెడ్డి, సంగీతం: లియోన్ జేమ్స్, సహనిర్మాత: ఆదిత్య మేరుగు, నిర్మాణం: ఎస్వీసీఎల్ఎల్పీ, స్పిరిట్ మీడియా.