బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss). తెలుగులో ప్రస్తుతం సీజన్ 5 జరుపుకుంటుంది.19 మంది సభ్యులతో షో మొదలు కాగా, ఏడోవారం ఇంటి నుండి నటి ప్రియ బయటకు వెళ్లింది. ముందు నుంచి ఓటింగ్ లిస్ట్‌లో టాప్ లో ఉన్న ప్రియ.. ఉన్నట్టుండి ఏడోవారం ఎలిమినేట్ అయ్యింది. అయితే ముందు నుంచి ప్రియ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు మిగిలిన హౌస్ మేట్స్. సన్నీతో పదే పదే గొడవ పడడం ప్రేక్షకులకి కూడా ఏ మాత్రం నచ్చలేదు.
బంగారు కోడిపెట్టటాస్క్లో సన్నీపై మాటల దాడి చేయడంతో ఆమెను ఎలిమినేట్ చేశారు. ముఖ్యంగా ఆమె వ్యవహార శైలి మైనస్ పాయింట్ అయిందనేది కొందరి అభిప్రాయం. ‘చెంప పగలకొడతా’ అంటూ సన్నీపై కోపం ప్రదర్శించడంతో ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకులూ ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలతో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.
బయటకు వచ్చిన ప్రియ(Priya)కు ఎంత రెమ్యునరేషన్ ముట్టి ఉంటుందో అని ప్రతి ఒక్కరు ఆరాలు తీస్తుండగా, తాజాగా ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నటికి ఒక్క వారానికే 1.5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ప్రియ ఏడు వారాలకు పది లక్షల పైనే సంపాదించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి