Priya Prakash Varrier | మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసింది. ఒరు ఆదార్ లవ్ సినిమాలోని కన్ను గీటే సన్నివేశంతో ఓవర్ నైట్ స్టార్డం అందిపుచ్చుకుంది. ఆ ఒక్క కన్నుగీటుతోనే పాన్ ఇండియా గుర్తింపు దక్కించుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. అయితే 2018లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది ప్రియా వారియర్. అంతేకాదు ఒక్క రోజులో 6 లక్షల మందికి పైగా ఫాలో అయిన ఏకైక నటిగా రికార్డు సృష్టించింది ప్రియా వారియర్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో హీరోయిన్గా పలు సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్‌లు దక్కించుకోలేక పోతున్న ఈ అమ్మడు ఇటీవల తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో గెస్ట్ రోల్ పోషించింది.
అలానే ఐటెం సాంగ్లోను కనిపించి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. సినిమాలో కనిపించింది కొద్ది సమయం అయినా కూడా ప్రియా ప్రకాశ్‌కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ నిత్య పాత్రలో నటించగా, ఆమె ‘తొట్టు తొట్టు’ పాటలో అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్‌లో స్టెప్పులు కన్ను గీటడానికి మించి వైరల్ అవుతున్నాయి. తాను ఎంతగానే అభిమానించే అజిత్ చిత్రంలో భాగం కావడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ప్రియా ప్రకాశ్ చెప్పుకొచ్చింది.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తర్వాత ప్రియా ప్రకాష్ వారియర్‌కి మరిన్ని ఆఫర్లు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం అందుతోంది. ఆ స్థాయి వసూళ్లు నమోదు కావడంతో మాత్రమే కాకుండా సినిమాలో ఆమె పాత్రకు, ఆమె ఐటెం సాంగ్‌కి మంచి గుర్తింపు దక్కిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చాలా మంది ఈ పాటను షార్ట్ వీడియో లేదంటే రీల్స్‌గా షేర్ చేస్తున్నారు. తద్వార ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది