90వ దశకంలో జీవనోపాది వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుని కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘గోట్ లైఫ్’ (ఆడు కాలం). మలయాళ స్టార్హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ టైటిల్‌రోల్ పోషిస్తున్నారు. హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, ఆల్ బలూషి, రిక్ ఆబే ఇతర పాత్రధారులు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు మేకర్స్ గురువారం వెల్లడించారు. ‘పూర్తిస్థాయి ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ‘ది గోట్ లైఫ్’. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథను వీలైనంత సహజంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. పలు దేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. అద్భుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందీ సినిమా’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కేఎస్, సంగీతం: ఏఆర్ రెహమాన్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్.