హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి జంటగా రూపొందుతున్న చిత్రం ‘మైల్స్ ఆఫ్ లవ్’. నందన్ దర్శకుడు. రాజిరెడ్డి నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది ప్యూర్ అండ్ హానెస్ట్ లవ్‌స్టోరి. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథల్లో భిన్నంగా వుండే చిత్రమిది. ప్రేమ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల విడుదలైన ‘తెలియదే.. తెలియదే’ అనే పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్ఆర్ ధ్రువన్.