Rashmika Mandanna | కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna)ను మేనేజర్ రూ.80 లక్షలు మోసం చేశాడంటూ కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నాను మేనేజర్ మోసం చేశాడన్న వార్తలపై మాత్రం.. ఆమె నుంచి కానీ, మేనేజర్ నుంచి కానీ అధికారిక సమాచారం లేదా ఫిర్యాదు నమోదైనట్టు కానీ అప్డేట్ రాలేదు. ఇంతకీ అసలు విషయమేంటని నెటిజన్లు, మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటుండగా.. తాజాగా ఈ వ్యవహారంపై అధికారికంగా స్పష్టత ఇచ్చారు రష్మిక, ఆమె మేనేజర్.
తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదని పేర్కొన్నారు. అంతేకాదు ఈ వివాదం కారణంగా తమ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్‌గా గ్యాప్ వచ్చిందన్న పుకార్లను కూడా కొట్టిపారేశారు. రష్మిక తన మేనేజర్ ప్రొఫెషనల్ కమిట్మెంట్ను గుర్తు చేస్తూ.. ఇద్దరు పరస్పర అంగీకారంతో తమ తమ మార్గాల్లో స్వతంత్రంగా పయనించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని సంయుక్తంగా ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా ప్రకటనతో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి తెరపడినట్లైంది.
రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ భామ ఖాతాలో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ యానిమల్ ఉంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న రణ్‌బీర్ కపూర్ హీరోగా వస్తోన్న ఈ మూవీలో రష్మిక మందన్నా పార్టుకు సంబంధించిన షూట్ ఇటీవలే ముగిసింది. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ అండ్ టీంతో రష్మిక దిగిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోవైపు సుకుమార్-అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ (Pushpa : The Rule)లో నటిస్తోంది. పుష్ప కొత్త షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్టు కూడా ఇటీవలే ప్రకటించింది రష్మిక. మరోవైపు లీడ్ రోల్లో రెయిన్ బో చిత్రంలో కూడా నటిస్తోంది.
Rashmika