Premante | ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న ‘ప్రేమంటే’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ యాంకర్ సుమ కీలక పాత్రను పోషిస్తున్నది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్‌పై ‘థ్రిల్లూ ప్రాప్తిరస్తు’ అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని పెంచుతున్నది.
ముహూర్తపు సన్నివేశానికి హీరో రానా క్లాప్‌నివ్వగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విఛాన్ చేశారు. ‘ఆహ్లాదభరితమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి పాత్ర వైవిధ్యంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి, సంగీతం: లియోన్ జేమ్స్, రచన-దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్.