కిషోర్ కేఎస్డీ, దియా సితెపల్లి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ప్రేమకథ’. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదల కానున్నది. గురవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. హృద్యమైన ప్రేమకథా చిత్రమిదని, యువతరాన్ని బాగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండెం, నిర్మాతలు: విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్, రచన-దర్శకత్వం: శివశక్తి రెడ్డి.