Preity Zinta | ఏఐ డీప్‌ఫేక్స్.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన నటి ప్రీతి జింతా!
Bombay High Court | బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వాడి సృష్టించిన డీప్‌ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్‌కు వ్యతిరేకంగా ఆమె కోర్టుకు వెళ్లింది.
Preity Zinta | బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వాడి సృష్టించిన డీప్‌ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్‌కు వ్యతిరేకంగా ఆమె కోర్టుకు వెళ్లింది. ఈ కంటెంట్‌ను ఇంటర్నెట్ నుండి పూర్తిగా తొలగించేలా అత్యవసర ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ మాధవ్ జామదార్.. కంటెంట్‌ను వెబ్సైట్ల నుండి తొలగించడానికి ఒక సులువైన విధానాన్ని రూపొందించాలని ఇరు పక్షాలకు సూచించింది. కాగా దీనిపై తదుపరి విచారణ జూలై 6న జరగనుంది.
ప్రీతి జింతా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో గూగుల్, మెటా వంటి సోషల్ మీడియా సంస్థలతో పాటు డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లను ప్రతివాదులుగా చేర్చారు. నటి తరఫు సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ ధోండ్ వాదనలు వినిపిస్తూ.. రోజురోజుకూ ఈ డీప్‌ఫేక్స్ నాణ్యత పెరుగుతోందని, అందువల్ల తక్షణమే సదరు లింకులను తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మరోవైపు గూగుల్, మెటా సంస్థల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. వివాదాస్పద లింకులను తొలగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే సాధారణ చట్టబద్ధమైన కంటెంట్‌ను ముందస్తుగా పర్యవేక్షించి బ్లాక్ చేయాలనే నిబంధనలు విధించవద్దని కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సాధారణ కంటెంట్‌కు ఇబ్బంది లేకుండా, కేవలం అభ్యంతరకర లింకులను మాత్రమే తొలగించేలా ఒక ప్రాక్టికల్ ప్రోటోకాల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

