‘కన్నప్ప’ సినిమాతో తొలిసారి టాలీవుడ్ తెరపై మెరిసిన తార ప్రీతి ముకుందన్. ‘కన్నప్ప’ను వీక్షించిన యువతరం ప్రీతి ముకుందన్ అందచందాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఓ విధంగా ఈ తమిళ సోయగం ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ‘కన్నప్ప’లో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ప్రీతి ముకుందన్.
‘ ‘కన్నప్ప’ ఓ అరుదైన అవకాశం. అదృష్టం కొద్దీ వచ్చిన అవకాశం అది. ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఆయన చాలా స్వీట్ పర్సన్. ఆయన ఎక్కడుంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది. ఆ ప్రత్యేకత స్క్రీన్‌పై కూడా కనిపిస్తుంది. పాన్ఇండియా సూపర్‌స్టార్ అయినా.. ఎక్కడా ఆ భేషజం ఆయనలో కనిపించదు. సెట్లో అందర్నీ గౌరవిస్తారాయన. ఎవర్నీ చిన్నచూపు చూడరు.’ అంటూ చెప్పుకొచ్చింది ప్రీతి ముకుందన్.