Nara Rohit | నారా రోహిత్ నుంచి సినిమా వచ్చి ఏళ్లు దాటిపోయింది. సోలో, ప్రతినిధి, రౌడీ ఫేల్లో, అసుర వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసినా జనాల్లో ఆయన పేరు ఎక్కువగా రిజిస్టర్ కాలేదు. ఫిజిక్ పైన ఎక్కువగా దృష్టిపెట్టక, కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేక తెరమరుగయ్యాడు. చివరగా ఆయన ఐదేళ్ల కిందట వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమాలో కనిపించాడు. ఆ తరువాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ నారా రోహిత్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌తో వస్తున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. స్క్రిప్ట్‌లోని 60వ సీన్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా వీలైనంత త్వరగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందుగా జనవరి 25న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్‌లో ప్రతినిధి ఒకటి. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ.. బుల్లితెరపై మాత్రం సంచలనాలు సృష్టించింది. ఇప్పుడదే సినిమా సీక్వెల్‌తో నారా రోహిత్ ఎంట్రీ ఇస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. తొలిపార్ట్ రేంజ్లో సీక్వెల్ ఉంటే మట్టుకు సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం.
Take, Shot, Action ~ #Prathinidhi2 𝐒𝐡𝐨𝐨𝐭 𝐁𝐞𝐠𝐢𝐧𝐬! ☝🏻🔥
Here's a BTS click of @IamRohithNara 🤩
A @SagarMahati Musical 🎹@murthyscribe @Nchamidisetty @TSAnjaneyulu1 @Kumarraja423 @VanaraEnts
Jan 25th, 2024 Release. pic.twitter.com/6MkytqSN4B
— Vamsi Kaka (@vamsikaka) August 28, 2023