ఆ క్రూరత్వం తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఎన్టీఆర్ ‘డ్రాగన్' సినిమా షూటింగ్ గప్‌చుప్‌గా జరిగిపోతున్నది. సినిమా షూటింగ్ ప్రారంభంలో ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా ‘డ్రాగన్' నిలుస్తుందని సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. తాజాగా ఆయన అభిమానులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ‘డ్రాగన్' గురించి,
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ గప్‌చుప్‌గా జరిగిపోతున్నది. సినిమా షూటింగ్ ప్రారంభంలో ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా ‘డ్రాగన్’ నిలుస్తుందని సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. తాజాగా ఆయన అభిమానులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ‘డ్రాగన్’ గురించి, అందులోని ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో ‘డ్రాగన్’పై అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘అయిదేళ్ల క్రితం ‘డ్రాగన్’ కథ చెప్పేందుకు తారక్‌ని కలిశాను. కథంతా విన్న తర్వాత నిర్ణయం తెలిపేందుకు తను కాస్త ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. ఈ కథను ఓకే చేయడం నిజంగా కఠినమైన నిర్ణయం.
‘డ్రాగన్’లో కథానాయకుడి పాత్ర అత్యంత క్రూరంగా ఉంటుంది. ఆ క్రూరత్వం తెలిస్తే ఆశ్చర్యపోతారు. సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఆ పాత్ర తీరుతెన్నులుంటాయి. అందుకే.. తను అంగీకరించడేమో అనుకున్నా. కానీ నాకే షాకిస్తూ ఒప్పుకున్నాడు. ఆ నిర్ణయమే త్వరలో ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నది’ అంటూ ధీమా వెలిబుచ్చారు ప్రశాంత్‌నీల్. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 1960 కాలంలో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, నల్లమందు వ్యాపారం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానున్నది. రుక్మిణీవసంత్ కథానాయిక. అనిల్‌కపూర్ కీలక పాత్రధారి. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీమేకర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

