Prakash Raj | ఒకవైపు శత్రుదేశం పాకిస్థాన్‌తో భారత్ వీరోచితంగా పోరాడుతుంటే మరోవైపు బీజేపీ సోషల్ మీడియా వేదికగా తన నీచబుద్ది చూపిస్తుందని నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించాడు. భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ శాంతి చర్చలంటూ సమయం గడపదంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది బీజేపీకి చెందిన అధికారిక సోషల్ మీడియా. అయితే ఈ వీడియోపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ..
”ఇలాంటి సంక్షోభ సమయంలో సైన్యం యుద్ధం చేస్తుంది.. సరిహద్దుల్లో పౌరులు రక్తమోడుతున్నారు. దేశం ఐక్యంగా పోరాడుతుంది. కానీ కొందరూ మతోన్మాద మూర్ఖులు మాత్రం అత్యంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. భారతీయ మతోన్మాద పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. ఇలా చేస్తుంటే మీకు సిగ్గనిపించట్లేదా”. అని ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు.
When the country is united in the times of crisis.. Army is fighting.. Citizens on the border are bleeding..and the Morons are busy .. Dirtiest Politics by the Bigots party of India.. @BJP4India . aren’tyou ashamed #justasking https://t.co/tNeVpg3Fmw
— Prakash Raj (@prakashraaj) May 10, 2025