Prakash Raj | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్‌ల మధ్య ఎక్స్‌లో వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి లడ్డూ విషయంలో వీరిద్దరి మధ్య మొదలైన ఈ రచ్చ ఇంకా కోనసాగుతునే ఉంది. అయితే పవన్ కళ్యాణ్‌ను దేవుడిని రాజకీయల్లోకి లాగడంటూ తనకు సమయం దొరికినప్పుడల్లా విమర్శిస్తున్నాడు ప్రకాశ్ రాజ్. అయితే గురువారం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి సుదీర్ఘ ప్రసంగం ఇచ్చిన విషయం తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్రానికి పలు సూచనలు చేస్తూ డిక్లరేషన్(Declaration) ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఇతర మతాల గురించి ఎవరైనా మాట్లాడితే నటులు, చిత్రపరిశ్రమ, వ్యాపారస్తులు అందరూ మాట్లాడుతారని, సనాతన ధర్మంపై దాడులు జరిగితే ఒక్కరూ స్పందించరని ఆరోపించారు. ఈ మధ్య దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఈ దేశానికి వెన్నముక శ్రీరాముడని అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని వెల్లడించారు. ప్రకృతిలోని ప్రతిజీవి సుఖంగా ఉండాలని సనాతన ధర్మం కోరుకుంటుందని, సనాతన ధర్మంపై దాడులు జరిగితే ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ధైర్యంగా గొంతు విప్పాలని కోరారు.
నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారు. నా ప్రాయశ్చిత్త దీక్షను కూడా అవహేళన చేశారని మండిపడ్డారు. సనాతన ధర్మం ఎప్పుడూ మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని కోరుకోదని అన్నారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అనుకుంటున్నారని, హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందని వెల్లడించారు.
హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడమే సనాతన ధర్మంపైనా దాడులకు కారణమని అన్నారు. హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారని, మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చామని అన్నారు. సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే పవన్ వ్యాఖ్యలపై తాజాగా మరోసారి కౌంటర్ ఇచ్చాడు ప్రకాశ్ రాజ్. సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం. అంటూ పవన్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. కాగా.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం.
జస్ట్ ఆస్కింగ్. 🙏🏿🙏🏿🙏🏿 All the Best #justasking— Prakash Raj (@prakashraaj) October 4, 2024