Operation Sindoor | జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చర్యకు సంబంధించి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయగా.. ఇందులో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అయితే భారత సైన్యం చేసిన ఆపరేషన్‌పై ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యానికి మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. ‘జై హింద్’, ‘భారత్ మాతాకీ జై’, ‘ఆపరేషన్ సిందూర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అగ్ర నటుడు ఎన్టీఆర్ కూడా
ఆపరేషన్ సిందూర్‌లో మన భారత సైన్యం యొక్క భద్రత, శక్తి కోసం ప్రార్థిస్తున్నాను. జై హింద్! అంటూ ఎన్టీఆర్ రాసుకోచ్చాడు.
Praying for the safety & strength of our Indian Army in #OperationSindoor.
Jai Hind! 🇮🇳
— Jr NTR (@tarak9999) May 7, 2025
ప్రకాశ్ రాజ్ రాసుకోస్తూ.. మన భారత సాయుధ దళాలకు వందనం.. భారతదేశం ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదు.. #జైహింద్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
Saluting our Indian Armed Forces.. India will never tolerate terrorism.. 💪💪💪🇮🇳🇮🇳🇮🇳 #JaiHind pic.twitter.com/yf8neoqDCU
— Prakash Raj (@prakashraaj) May 7, 2025