Maathru | టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ శ్రీరామ్. ఇప్పటికే మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇదే జోనర్లో ఈ టాలెంటెడ్ యాక్టర్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం మాతృ (Maathru) .
మదర్ సెంటిమెంట్‌తో సాగే చూస్తున్నవేమో పాటను విడుదల చేశారని తెలిసిందే. ఈ పాటపై తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మదర్ సెంటిమెంట్ మీద సినిమాలు అంతగా రావడం లేదన్నారు. తల్లి ప్రేమను చాటి చెప్పే పాటలు కూడా రావడం లేదని అభిప్రాయ పడ్డారు. మదర్ సెంటిమెంట్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న మాతృ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాశారు. శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఈ పాటను కారుణ్య పాడాడు. కారుణ్య వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో బి శివ ప్రసాద్ నిర్మించారు. జాన్ జక్కి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నందినీరాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చూస్తున్నవేమో లిరికల్ సాంగ్..
#TammareddyBharadwaja garu appreciated #Maathru film #Chustunnavemo Song pic.twitter.com/c6nluSeYGV
— Sai Satish (@PROSaiSatish) March 28, 2025
Prabhas Spirit | మెక్సికోలో షూటింగ్.. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగా
Lucifer 2 Empuraan | మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై 17 సెన్సార్ కట్స్
Pawan Kalyan | ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఇక సమయం లేదు మిత్రమా..!