Pragya Jaiswal | హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్‌లో కనిపిస్తే చాలు, అభిమానులూ, ఫోటోగ్రాఫర్లూ వారి వెనక పడి ఎలాంటి ఇబ్బందులకి గురి చేస్తుంటారో మనం చూస్తూనే ఉన్నాం. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, వీడియోలు ఇలా ఓ రేంజ్ హడావిడి మొదలవుతుంది. కొంతమంది సెలబ్రిటీలు వారి ప్రేమను ఓపికతో హాండిల్ చేస్తే, మరికొంతమందికి మాత్రం చిరాకు కలుగుతుంది. తాజాగా గ్లామర్ డాల్ ప్రగ్యా జైస్వాల్‌కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురు కాగా, ఆగ్రహంతో వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇటీవల ఓ పార్టీలో పాల్గొన్న ప్రగ్యా జైస్వాల్‌ను చూసిన ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. ఆమె వెంటపడి మరీ ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. దీంతో ప్రగ్యా కొద్దిగా అసహనం వ్యక్తం చేసింది. ఫోటోగ్రాఫర్స్ని ఏదో తిట్టేసుకుంటూ వెళ్లింది. ఇప్పుడు ప్రగ్యా వీడియో నెట్టింట వైరల్ కాగా, దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఫొటోగ్రాఫర్స్పై ఫైర్ అవుతున్నారు. మరి కొందరు అలాంటి డ్రస్ వేసుకుని పబ్లిక్ ప్లేస్‌కు వచ్చావు.. ఇప్పుడు ఫోటోలు తీస్తే ఎందుకు బాధపడుతున్నావు? అంటూ ప్రగ్యానే తప్పు చేసినట్టుగా కామెంట్లు చేస్తున్నారు.
తెలుగులో డేగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా, కంచె సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా సరైన బ్రేక్ రాలేదు. కానీ బాలయ్యతో చేసిన ‘అఖండ’ మూవీతో ఆమె క్రేజ్ బాగా పెరిగింది. ఇటీవల ‘డాకు మహారాజ్’ చిత్రంలోనూ కనిపించి ఆకట్టుకుంది. ఇక సినిమాలతో పాటు యాడ్స్, ఫ్యాషన్ ఈవెంట్స్‌లోనూ ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ప్రగ్యా యాక్టివ్‌గా ఉండి తన ఫొటోషూట్లతో కుర్రకారుకు మతి పోగొడుతోంది. అయితే పబ్లిక్ ఫిగర్‌గా ఉండటం అంటే ఫ్యాన్ఫాలోయింగ్తో పాటు ఇలాంటివి కూడా సహించాల్సిందే అని కొందరు అంటున్నారు.