ఫ్యామిలీమ్యాన్ మనోజ్ బాజ్‌పేయి, అక్కినేని వారసుడు నాగచైతన్య ఇద్దరూ తనను ఎంతో ఆదరించారని చెబుతున్నది నటి ప్రాచీ దేశాయ్. మనోజ్‌తో ‘సైలెన్స్ 2’ వెబ్‌సిరీస్ కోసం పనిచేసింది ప్రాచి. ఇటీవల ఓటీటీలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న వెబ్‌సిరీస్ ‘దూత’లో నాగచైతన్యతో స్క్రీన్ పంచుకుంది. ఈ రెండు సిరీస్‌ల షూటింగులు వేర్వేరు చోట్ల, వేర్వేరు సమయాల్లో జరిగినా.. తన పట్ల వీరిద్దరూ చూపించిన అభిమానం మర్చిపోలేనని చెబుతున్నది ప్రాచి. పసందైన భోజనంతో ఈ ఇద్దరూ తనను కట్టిపడేశారని కాంప్లిమెంట్స్ ఇచ్చింది.
“దూత’ షూటింగ్ చాలా కూల్‌గా జరిగింది. సీన్ల విషయం పక్కనపెడితే.. లంచ్ బ్రేక్ ఎప్పుడు అవుతుందా అనిపించేది. ప్రతిరోజూ చైతన్య తీసుకొచ్చే డెలీషియస్ వెరైటీలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఎదురుచూసేదాన్ని’ అని చెప్పుకొచ్చింది ప్రాచి. ‘మనోజ్ సార్ కో-స్టార్ గురించి చాలా కేర్ తీసుకుంటారు. అవసరమైన సలహాలు చెబుతారు. పూర్తి స్వేచ్ఛనిస్తారు. అంతేకాదు లంచ్ టైమ్‌కి రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేసేవారు. తను స్వయంగా చేసి మరీ తెచ్చేవారు’ అని మనోజ్‌ను ఆకాశానికెత్తేసింది ప్రాచి. మొత్తంగా రెండు షూటింగ్స్‌లోనూ ఒకేరకమైన విందు వినోదం తనకు దక్కాయంటున్నది.