ప్రణవ్ సింగంపల్లి, పాజ్ఞ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’. శ్రీనాథ్ పులకురం దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు.
‘యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. టీనేజ్ లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటుంది. యువతకు తప్పకుండా నచ్చుతుంది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిఖిల్ సురేంద్రన్, సంగీతం: కార్తీక్ రోడ్రీగుజ్, నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి, దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం.