Prabhu Deva | ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా, తన డ్యాన్స్‌తోనే కాకుండా హీరోగా, నటుడిగా, డైరెక్టర్, నిర్మాతగా కూడా సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన నటించినా, దర్శకత్వం వహించినా, ప్రతి ప్రాజెక్ట్‌కు ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. తాజాగా ఆయన జగపతి బాబు హోస్ట్ చేస్తున్న “జయము నిశ్చయమ్మురా” టాక్ షోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ షోలో పాల్గొన్న ప్రభుదేవా, తన భార్య అయిన హిమనీ సింగ్‌తో ప్రేమాయణం ఎలా నడిపించాడో వెల్లడించారు.
ఒకసారి బాలీవుడ్లో సినిమా చేస్తున్నప్పుడు చేతికి గాయం అయింది. ఫిజియోథెరపీ కోసం హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు హిమనీ సింగ్ అనే డాక్టర్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది. అలా పరిచయం మొదలై ప్రేమగా మారింది. ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మా పాప పేరు సియా. ఆమె నా జీవితంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది.. కానీ చేతి నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు.. నాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చి, నన్నే ప్రేమలో పడేసావు కానీ ఆ నొప్పి మాత్రం ఇంకా ఉంది అని ఎప్పుడూ ఆమెకి చెబుతుంటాను అని చెప్పుకొచ్చాడు . ప్రభుదేవా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రభుదేవా 1995లో రమాలత్ అనే మహిళను ప్రభుదేవా వివాహం చేసుకున్నారు.వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నా, 2011లో విడాకులు తీసుకున్నారు. తర్వాత నటి నయనతారతో ప్రభుదేవా రిలేషన్ షిప్ కొనసాగించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ బంధం కూడా త్వరగానే ముగిసిపోయింది. 2020లో డాక్టర్ హిమనీ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఒక కుమార్తె సియా ఉంది. ప్రభుదేవా భార్య హిమనీ అత్యంత ప్రైవేట్ పర్సన్. ముంబైలో డాక్టర్‌గా పని చేస్తున్న ఆమె, పబ్లిక్ అపిరియరెన్స్లకు దూరంగా ఉంటారు. ఒక టీవీ షోలో, మరోసారి తిరుమలలో పూజ సమయంలో మాత్రమే ఆమె కనిపించారు. ప్రభుదేవా మాత్రం ముంబైలో నివసిస్తూ, అన్ని ఇండస్ట్రీలలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.