పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 23న సినిమా నుంచి తొలిపాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. దీనితో పాటు అనౌన్స్మెంట్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. హారర్ కామెడీతో ఎవర్గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ‘ది రాజాసాబ్’ని మారుతి తెరకెక్కిస్తున్నారనీ, భారీ నిర్మాణ విలువలతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కిందని, ప్రభాస్ కెరీర్లోనే మెమొరబుల్ మూవీగా ‘ది రాజాసాబ్’ నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: టీజీ కృతి ప్రసాద్.