ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. చేతిలో వరుసగా పానిండియా సినిమాలు ఉన్నప్పటికీ తొలి ప్రాధాన్యత ఆయన ‘స్పిరిట్’ సినిమాకే ఇస్తున్నట్టు తెలిసింది. అడిగినన్ని బల్క్ డేట్లు ఇవ్వడంతో ప్రస్తుతం ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఎలాంటి ఆలస్యం లేకుండా వచ్చే ఏడాది మార్చి 5న పక్కాగా ‘స్పిరిట్’ విడుదలయ్యేలా ఓ ప్లాన్ ప్రకారం చిత్రీకరణ జరుపుతున్నారట. ఇదిలావుంటే.. షూటింగ్ ప్రారంభంలోనే ఏ మాత్రం బాడీ డబుల్స్‌ని ఉపయోగించనని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు ప్రభాస్ మాట ఇచ్చారట.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఏ మాత్రం బాడీ డబుల్ని ఉపయోగించకుండా, ప్రతి సన్నివేశాన్నీ తానే స్వయంగా చేస్తున్నారట ప్రభాస్. ‘ది రాజా సాబ్’ సినిమా విషయంలో బాడీ డబుల్స్ వాడకంపై వచ్చిన విమర్శలను కూడా దృష్టిలో పెట్టుకొని, తనను విమర్శించిన వారికి ‘స్పిరిట్’ ద్వారా ప్రభాస్ సరైన సమాధానం ఇవ్వబోతున్నారని చిత్రబృందం చెబుతున్నది. ఆవేశపరుడైన నిజాయితీ గల పోలీస్ అధికారిగా ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ కథానాయిక. వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. భద్రకాళి పిక్చర్స్, టి.సిరీస్ కలిసి ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.