ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). వీటిలో ఒకటి ప్రాజెక్టు కే (Project K). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. రీసెంట్గా ప్రాజెక్టు కే తాజా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లో ప్రాజెక్టు కే కార్యాలయాన్ని (Project K office) ప్రారంభించాడు.
ఈ కార్యక్రమానికి నాగ్ అశ్విన్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. ఈవెంట్లో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజా స్టిల్‌లో ప్రభాస్ కొంత బొద్దుగా కనిపిస్తున్నాడు. సలార్ కోసమే ప్రభాస్ ఈ గెటప్‌లోకి మారి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో కలిసి దిగిన ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ప్రభాస్ చేస్తున్న సలార్ కూడా షూటింగ్ దశలో ఉంది. ఓం రౌత్‌తో ఆదిపురుష్ కూడా చేస్తున్నాడు. దీంతోపాటు మారుతి డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రాబోయే రెండు సంవత్సరాలపాటు తీరిక లేకుండా బిజీగా ఉండనున్నాడు ప్రభాస్.
Picture perfect.👌#AmitabhBachchan #KRR #Prabhas #DulquerSalmaan #Nani and #PrashanthNeel at @VyjayanthiFilms #ProjectK new office opening 👍 pic.twitter.com/CZefJhknvz
— Suresh Kondi (@SureshKondi_) June 27, 2022