Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా క్రేజీ లైనప్ కలిగిన హీరోగా నిలిచాడు. వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ విభిన్న కథతో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సీతారామం వంటి క్లాసికల్ లవ్‌స్టోరీ తరువాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా ఇది. ఇందులో ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటించడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ‘ఫౌజీ’ సెట్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు హను రాఘవపూడికి కోపం ఎక్కువగా ఉండటం సినీ వర్గాల్లో తెలిసిందే. సినిమా మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాడు. ఈ క్రమంలో చిన్న విషయంలోనూ గట్టి రియాక్షన్ ఇస్తారట. దీంతో సెట్లో కొన్నిసార్లు ఆయన కోపం తారాస్థాయికి చేరుకుంటుందట. ఈ నేపథ్యంలో ప్రభాస్, హనుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. “మీకున్న ప్యాషన్, డెడికేషన్ అద్భుతం. కానీ ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి” అంటూ హనుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట ప్రభాస్. ఇదంతా పాజిటివ్ వాతావరణంలోనే జరిగిందట. ఈ వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హను మాట్లాడుతూ, “‘ఫౌజీ’ కథ నా మనసులో చాలా కాలంగా ఉంది. ఇది నేను ప్రత్యేకంగా ప్రభాస్ కోసం రాసిన స్క్రిప్ట్. సీతారామం తరువాత ఈ సినిమాపై రెండు సంవత్సరాలుగా శ్రమిస్తున్నాను. ఆర్మీ నేపథ్యంలో నేను రాసిన ఆరు కథల్లో ఇది ప్రత్యేకం. ఆడియన్స్ ఎలాంటి అంచనాలతో వచ్చినా, వాటిని మించేదిగా ఉంటుంది” అంటూ పేర్కొన్నారు.అలాగే, “ప్రభాస్ ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తారు. ఆయనను ప్రేక్షకులు ఇలా ఎప్పుడూ చూడలేదు. ఎమోషనల్, ఇంటెన్స్, మరియు మాచో ఎలిమెంట్స్ కలగలిపిన పాత్ర ఇది” అని హను చెప్పారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.