అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న క్రేజీ పానిండియా హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలు. సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియాఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చుతున్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 17న ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. ‘సహన సహన..’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన ప్రోమోను ఈ సందర్భంగా ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌తో అల్ట్రా ైస్టెలిష్ వైబ్ క్రియేట్ చేసేలా విభిన్నంగా ఈ పాటలో కనిపిస్తున్నారు ప్రభాస్. తమన్ కెరీర్లో బెస్ట్ మెలొడీగా ఈ పాట నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రభాస్, నిధి అగర్వాల్‌పై చిత్రీకరించిన ఈ పాటలో లొకేషన్స్ కూడా హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని.