Prabhas | డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ప్రభాస్ నటించిన రాజా సాబ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మేకర్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన నటించిన కల్ట్ క్లాసిక్ ‘పౌర్ణమి’ సినిమాను తిరిగి థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న 4కే క్వాలిటీతో రీ-రిలీజ్ కానుంది. టెక్నికల్‌గా సినిమాను పూర్తి స్థాయిలో అప్డేట్ చేసినట్లు సమాచారం. యాక్షన్ చిత్రాల్లో దూకుడుగా దూసుకెళ్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి రొమాంటిక్ షేడ్స్‌తో వెండితెరపై కనిపించబోతున్నారు.
‘వర్షం’ వంటి బ్లాక్‌బస్టర్‌లో జోడీగా మెప్పించిన ప్రభాస్ – త్రిష ఈ చిత్రంలో మరోసారి స్క్రీన్‌పై హిట్ కెమిస్ట్రీని పంచుకున్నారు. అలాగే ఛార్మి కౌర్ సెకండ్ లీడ్‌గా కనిపించారు. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు (సుమంత్ ఆర్ట్స్) నిర్మించారు. 2006లో విడుదలైన సమయంలో ‘పౌర్ణమి’కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, కాలక్రమంలో ఇది ఒక కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. సంగీతం, విజువల్స్, కథనానికి అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. తాజా పరిస్థితుల్లో రీ-రిలీజ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో, ‘పౌర్ణమి’కూడా భారీ వసూళ్లు దక్కే అవకాశముంది.
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ‘ది రాజా సాబ్’ (డిసెంబర్ 5 విడుదల) కోసం ఎదురు చూస్తున్నారు.అంతకంటే ముందు అక్టోబర్ 31న ‘బాహుబలి: ది ఎపిక్’ (బాహుబలి: ది బిగినింగ్‌కి 10 ఏళ్ల సందర్భంగా) థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకన్నా ముందే సెప్టెంబర్‌లో ‘పౌర్ణమి’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తికరమైన పరిణామం. ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్‌తో పౌర్ణమి మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంటుందా? లేదా అనేది చూడాల్సిందే!