టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ క్రేజీ కాంబినేషన్ ఏదైనా ఉందా..? అంటే అది మారుతి (Maruthi)-ప్రభాస్ (Prabhas) దే అని చెప్పాలి. పాన్ ఇండియా హీరో ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రభాస్.. మళ్లీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో తెలుగు సినిమా చేస్తుండటం, అది కూడా హ్యూమర్ టచ్ ఉన్న సినిమాలు చేసే మారుతి డైరెక్షన్లో నటిస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ప్రభాస్ నేడు ఈ ప్రాజెక్ట్ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. రామోజీఫిలిం సిటీలో వేసిన భూత్ బంగ్లా సెట్స్ (Haunted House)లో జరుగుతున్న షూట్లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ప్రభాస్ ప్రస్తుతానికి షూట్ కోసం వారంరోజులు డేట్స్ ఇచ్చాడని ఇన్సైడ్ టాక్.
సోషల్ మీడియా సెన్సేషన్ మాళవికా మోహనన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. ప్రభాస్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆది పురుష్, సలార్, ప్రాజెక్టు కే షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : Ram Charan | ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాంచరణ్‌కు ఆహ్వానం.. వివరాలివే
Read Also : MM Keeravani | మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట విషాదం..
Read Also : Aadhi Pinishetty | ఆది పినిశెట్టి బర్త్ డే స్పెషల్.. శబ్దం లుక్ రిలీజ్