Nidhhi Agerwal | టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో ఆమె ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిధి ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు మూవీ’లో నటిస్తున్నది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానున్నది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ పూజల వీడియో బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మూవీ విజయవంతమై కెరియర్ గాడిలో పడాలని వేణుస్వామితో పూజలు చేయించినట్లుగా తెలుస్తున్నది. నిధి అగర్వాల్ 2017లో హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
2018లో సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అంతగా కలిసిరాలేదు. ప్రస్తుతం నిధి చేతిలో రెండు భారీ ప్రాజెక్టులున్నాయి. పవన్ హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదల కానున్నది. ఇక ప్రభాస్ సరసన ‘రాజాసాబ్’ మూవీలో నటిస్తున్నది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ రెండు సినిమాలపైనే నిధి ఆశలు పెట్టుకున్నది. రెండు సినిమాలు తన కెరియర్లో కీలమని భావిస్తున్నది. ఈ క్రమంలోనే వేణుస్వామితో పూజలు చేయించినట్లు తెలుస్తున్నది. గతంలోనూ వేణుస్వామిని నిధి అగర్వాల్ సంప్రదించింది. ఆయన సలహాలు, సూచనలు పాటించిందని.. ఆ తర్వాత మంచి ఆఫర్లు వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా మరోసారి ఆయనతో పూజలు చేయించుకున్నట్లు భావిస్తున్నారు.
గతంలో పలువురు హీరోయిన్లు సైతం వేణుస్వామితో పూజలు చేయించుకున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, డిపుల్ హయతి, యాంకర్ అషురెడ్డితో సహా పలువురు సైతం ఈ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. నిధి అగర్వాల్ మరో కీలక ప్రాజెక్టును దక్కించుకున్నట్లు సమాచారం. త్రివిక్రమ్, విక్టరీ వెంకటేశ్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ మూవీకి ‘వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం’ టైటిల్‌ను సైతం ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, ఈ మూవీలో నిధి అగర్వాల్ ఒక హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. మరో హీరోయిన్గా త్రిషను తీసుకున్నారని టాక్ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తున్నది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.