ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న దేశభక్తి ప్రధాన చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు దేశభక్తి, ప్రేమ, త్యాగం అంశాలతో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది.
ఈ పాన్ ఇండియా సినిమా విడుదల గురించి ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తచేసుకుంది.
మంచి క్వాలిటీ అవుట్‌పుట్‌ను దృష్టిలో పెట్టుకొని పోస్ట్‌ప్రొడక్షన్ కోసం మరింత సమయాన్ని వెచ్చించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యర్నేని, వై.రవిశంకర్.