అంతఃతరంగాల తీరం
ఒకవైపు నిశ్శబ్దం... మరోవైపు ఘోష లోపల ఎంతలోతో, బయట అన్నిఅలల అలజడులు. మహాసముద్రం...ఒక మనిషి జీవితం!
ఒకవైపు నిశ్శబ్దం… మరోవైపు ఘోష
లోపల ఎంతలోతో,
బయట అన్నిఅలల అలజడులు.
మహాసముద్రం…ఒక మనిషి జీవితం!
అనంతం.. అపరిమితం
ఎక్కడ మొదలైందో తెలియదు,
ఎక్కడ ముగుస్తుందో కనిపించదు.
కన్నీళ్ల ఉప్పును దాచుకున్న అగాధమది,
పైకి మాత్రం నీలిరంగు
నవ్వుల ముసుగు తొడుగుతుంది.
కాలపు గాలులు విసిరే విసిరినట్లు,
కలల అలలు ఎగసిపడి…
మళ్లీ పతనమవుతుంటాయి.
లోకం చూసేది కేవలం
పైకిలేచే కెరటాల ఆర్తనాదాలనే.
చుట్టూ ఇంత నీరున్నా..
దాహం తీర్చుకోలేని ఒక విచిత్ర వైరుధ్యం.
ఒక అలవచ్చి తీరాన్ని తాకివెళ్తుంది…
జ్ఞాపకం వచ్చి మనసును తాకివెళ్తుంది.
ఎంత ఎగసినా తనలోనే లీనమవ్వాలి,
ఎంతబతికినా శూన్యంలోనే కలిసిపోవాలి
ఒక నువ్వు, ఒక నేను…
అంతా ఆ మహాసముద్రంలో చుక్కలమే!
తరిగొప్పుల విఎల్లెన్మూర్తి
8008577834
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

