ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ఇమాన్వి కథానాయిక. 1940 నాటి యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రభాస్ ఎక్కువగా ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని, నాయకానాయికలపై కొన్ని కీలకమైన ఘట్టాలను తెరకెక్కించారని తెలిసింది. దేశభక్తి ప్రధానంగా చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ప్రభాస్ పాత్రను నవ్యరీతిలో ఆవిష్కరిస్తూ దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదిలా వుండగా ప్రభాస్ తాజా చిత్రం ‘రాజాసాబ్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతున్నది.