Prabhas | అగ్ర హీరో ప్రభాస్ సోషల్‌మీడియాలో తక్కువగా కనిపిస్తుంటారు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకోవడానికి మాత్రమే ఆయన సోషల్‌మీడియా ఖాతాలను ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రభాస్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయినట్లు ఆయన టీమ్ వెల్లడించింది. ప్రభాస్ ఫేస్బుక్ ఖాతాకు 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ‘మనుషులు దురదృష్టవంతులు’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియో ప్రత్యక్షమయింది. ఖాతాను హ్యాక్ చేసి ఉద్దేశ్యపూర్వకంగా పెట్టిన వీడియో ఇదని అభిమానులు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రభాస్ టీమ్‌కు తెలియజేయడంతో వారు వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించడంతో పాటు ఖాతాను తిరిగి యాక్టివేట్ చేశారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సలార్’ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది.