పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. కేరళ వయనాడ్ బాధితులకు ఆయన ఆపన్నహస్తం అందించారు. ప్రకృతి విపత్తు వల్ల సర్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం రెండుకోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రభాస్ ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ విరాళం అందజేయనున్నారు ప్రభాస్. ఈ సందర్భంగా వయనాడ్ ప్రజలకు తన సానుభూతిని వెలిబుచ్చారు. ఈ కష్టసమయంలో కేరళ ప్రజానీకం ధైర్యంగా ఉండాలని, వారికి అందరం అండగా ఉండాలని ఆయన కోరారు.