Salaar 2 | కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ సలార్ (Salaar). ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన సలార్ పార్టు 1 గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టించింది. ప్రభాస్ ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్స్ సీక్వెల్ ప్రాజెక్ట్ సలార్ 2 (Salaar 2) ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ 2 అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం గ్లోబల్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర వార్త ఒకటి బయటకుంది.
ప్రభాస్ అభిమానులకు భారీ న్యూస్. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 షూటింగ్ మొదలైంది. హోంబలే ఫిలిమ్స్ ప్రకటించిన మోస్ట్ ఎవెయిటెడ్ సీక్వెల్ సలార్ 2 చిత్రీకరణలో ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్.. ప్రభాస్ ఈ షెడ్యూల్లో 20 రోజులపాటు పాల్గొనబోతున్నాడు.. అంటూ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సీక్వెల్‌ను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సలార్ 2ను 2025 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ టాక్.
ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం.. అంటూ నటి శ్రియారెడ్డి ట్వీట్ చేసింది. సలార్ 2లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. శ్రియారెడ్డి, టిన్ను ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాలీవుడ్ యాక్టర్ షైన్ టామ్ చాకో కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తుండగా.. మేకర్స్ ణుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
PRABHAS – PRITHVIRAJ – PRASHANTH NEEL – HOMBALE: ‘SALAAR 2’ SHOOT BEGINS… BIGGG NEWS for #Prabhas fans… On #Prabhas‘ birthday today, #HombaleFilms have officially announced the much-awaited sequel #Salaar Part 2… #Prabhas is participating in the ongoing 20-day schedule.… pic.twitter.com/046sgEnRXi
— taran adarsh (@taran_adarsh) October 23, 2024
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్