Project-k Special Poster | ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ వచ్చిన ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా నుండి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
తాజాగా రిలీజైన పోస్టర్ ప్రభాస్ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. ప్రభాస్ పోస్టర్ కాకుండా కేవలం ఐరన్‌మ్యాన్ లాగా డిజైన్ చేసిన చేయి ఫోటోను రిలీజ్ చేశారు. దీంతో డార్లింగ్ అభిమానులు ‘ప్రాజెక్ట్-k’ చిత్రబబృందంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బర్త్‌డే రోజున ఫస్ట్‌లుక్ ఎక్స్పెక్ట్ చేస్తే.. ఇలాంటి పోస్టర్లా రిలీజ్ చేసేది అంటు పెదవి విరుస్తున్నారు. సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నాడట. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
Here's wishing our Darling #Prabhas a Super Happy Birthday.#ProjectK #HappyBirthdayPrabhas pic.twitter.com/DwqMXNXHTO
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 23, 2022
Read Also:
Prabhas | ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశాడా?
‘మెగా154’ మాస్ గ్లింప్స్ రిలీజ్.. దీపావళికి పూనకాలే..!
Varausudu Movie | ‘వారసుడు’ సినిమా ఆడియో రైట్స్ అన్ని కోట్లా?
ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?