‘మెగా154’ మాస్ గ్లింప్స్ రిలీజ్.. దీపావళికి పూనకాలే..!
Mega154 Teaser Glimps | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'ఖైదీ నం.150'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన చిరుకు 'సైరా', 'ఆచార్య' ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి.
Mega154 Teaser Glimps | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఖైదీ నం.150’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన చిరుకు ‘సైరా’, ‘ఆచార్య’ ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజైన ‘గాడ్‌ఫాదర్’ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.. కానీ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది అసాధ్యమే అనిపిస్తుంది. ప్రస్తుతం చిరు ఆశలన్ని ‘మెగా154’ పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ టీజర్‌ను దివాళీ సందర్భంగా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా చిత్రబృందం తాజాగా టైటిల్ టీజర్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ టీజర్‌ను సోమవారం ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో చిరంజీవి యూనియన్ లీడర్‌గా కనిపించనుండగా.. రవితేజ పోలీస్ ఆధికారి పాత్రలో నటించనున్నాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Diwali begins with a MASS EXPLOSION 💥#Mega154 Title Teaser Tomorrow at 11.07 AM ❤️🔥
Let's welcome the 'MASS MOOLAVIRAT' 🔥
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @dirbobby @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/rjgYlVcgRH
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

