Varasudu Movie | వారసుడు సినిమా ఆడియో రైట్స్ అన్ని కోట్లా?
Varausudu Movie Audio Rights | టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటుడు దళపతి విజయ్. 'తుపాకి' సినిమాతో తెలుగులో ఈయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటి నుండి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.
Varasudu Movie Audio Rights | టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటుడు దళపతి విజయ్. ‘తుపాకి’ సినిమాతో తెలుగులో ఈయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటి నుండి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ‘బీస్ట్’తో భారీ ఫ్లాప్ సాధించిన విజయ్.. ఈ సారి ‘వారసుడు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. వారసుడు సినిమా ఆడియో రైట్స్ దాదాపు రూ.10 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ నెంబర్ అటు విజయ్ కెరీర్లోనూ.. ఇటు థమన్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ అట. అంతేకాకుండా తమిళంలోనూ అత్యధిక రేటుకు అమ్ముడైన టాప్-5 మ్యూజిక్ ఆల్బమ్లలో ఒకటిగా నిలిచింది. కాగా ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ దివాళికి రానున్నట్లు సమాచారం. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
#Varisu – audio rights 10cr is the best ever in @actorvijay and @MusicThaman ‘s career. One of the highest ever too in Tamil cinema. Songs have come out really well, will be chartbusters for sure 👌👌
— Rajasekar (@sekartweets) October 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

