ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nene Vathunna On OTT | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో ధనుష్. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది 'తిరు'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. అదే జోష్‌ను తన తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు.
Nene Vathunna On OTT | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో ధనుష్. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘తిరు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. అదే జోష్‌ను తన తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవలే ఈయన నటించిన ‘నేనే వస్తున్నా’ విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా నిలిచింది. రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న.. ‘పొన్నియన్ సెల్వన్’తో పోటీ పడలేక ఫ్లాప్‌గా మిగిలింది. రిజల్ట్ ఎలా ఉన్నా ఈ చిత్రంలో ధనుష్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. డ్యూయల్ రోల్లో ధనుష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. కాగా ‘నేనే వస్తున్నా’ చిత్రాన్ని అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రైమ్ సంస్థ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ రిలీజ్‌కు నాలుగు వారాలకు ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు. అంతేకాకుండా ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. ఈ చిత్రాన్ని ‘వి క్రియేషన్స్’ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

