ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ‘ఫౌజీ’ మీదే. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా ఈ ఏడాదే విడుదల కానుంది. అయితే.. రిలీజ్ డేట్ మీద ఇప్పటివరకూ క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేయనున్నారని తెలిసింది. ఆ రోజే విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వినికిడి. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్నదట.
తొలి భాగానికి ప్రీక్వెల్‌గా రెండో భాగం ఉంటుందని తెలిసింది. అభిమానుల్ని ఈ సినిమా కచ్చితంగా నిరాశపరచదని, ప్రభాస్ కెరీర్లోనే ‘ఫౌజీ’ ఓ మెమొరబుల్ మూవీగా నిలుస్తుందని ఇన్సైడ్ టాక్. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి నటిస్తున్నారు. అనుపమ్‌ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: నవీన్ యర్నేని, వై.రవిశంకర్, భూషణ్‌కుమార్, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.