పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (prabhas) నటిస్తోన్న తాజా చిత్రం సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ (Shruti Haasan) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అయితే సలార్‌కు సంబంధించిన వీడియో లీక్ ఒకటి ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ప్రభాస్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న షూట్ వీడియో బయటికి రావడంతో ఎక్జయిటింగ్‌కు లోనవుతున్న అభిమానులు వీడియోను ట్విటర్లో షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న సలార్ చిత్రీకరణకు సంబంధించిన వీడియో ఇలా లీక్ కావడంతో అంతా షాక్‌కు లోనవుతున్నారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
#Salaar leaked 💥💥💥💥💥 pic.twitter.com/E8BXdH28Fn
— For Trends™ (@Fortrendz) October 18, 2021
2022 ఏప్రిల్ 14న సలార్ ప్రేక్షకుల ముందుకురానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ (Vijay Kirgandur) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు.
ఇది కూడా చూడండి
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు