దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరు పొందారు సముద్రఖని. ప్రతీ పాత్రలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. శనివారం ఆయన జన్మదినం. ఈ సందర్భంగా పాన్ ఇండియా పీరియాడిక్ ఫిల్మ్ ‘కాంత’ నుంచి ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు.
1950 మద్రాస్ నేపథ్యంలో జరిగే ఈ కథ నాటి సామాజిక పరిస్థితులు, సంఘర్షణకు అద్దం పడుతుందని, సముద్రఖని పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఝను చంతర్, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.