Konda Surekha – Posani Krishnamurali | తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) టాలీవుడ్ సినీ నటులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ నటి సమంత, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్లపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఇప్పటికే సమంతకు, నాగార్జునకు పలువురు మద్దతుగా నిలిచారు. తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి కూడా ఈ వివాదంపై స్పందించాడు.
మంత్రి కొండా సురేఖ అలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పోసాని కృష్ణమురళి తెలిపాడు. కొండా సురేఖ కుటుంబం నాకు గత 30 ఏళ్లుగా తెలుసు. అయితే ఆమె ఎందుకు నోరుజారిందో సురేఖనే ఆలోచించుకోవాలి. నాగార్జున మంచి వ్యక్తి.. అలాంటి వ్యక్తి కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది. తనపై ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు.. అది మంచి పద్దతి కాదు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికి అయిన కొండా సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలి అని పోసాని కృష్ణమురళి వీడియోలో తెలిపాడు.
కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టిన పోసాని కృష్ణమురళి
మంత్రి కొండా సురేఖ అలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు.
నాగార్జున మంచి వ్యక్తి.. అలాంటి వ్యక్తి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు.
అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది. తనపై ఇప్పటికీ… pic.twitter.com/43jH5KBrqJ
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2024