పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, అయేషా ఖాన్ తదితరులు ప్రధాన పాత్రధారులు. ఈ నెల 17న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ ‘నేను పనిచేసిన అన్ని చిత్రాల్లో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’కి బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇచ్చానని చెప్పగలను. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఈ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు. ఈ చిత్రానికి మహదేవ్ ఏలెందర్ సంగీతాన్నందించారు.